బాహుబలి రికార్డుని తిరగరాసిన ఎన్టీఆర్
బాహుబలిని రికార్డుని తిరగరాయాలంటే మళ్లీ బాహుబలే రావాలి. ‘ది కంక్లూజన్’ తప్ప ‘ది బిగినింగ్’ను దాటే సత్తా ఏ సినిమాకూ లేదు. సమీప భవిష్యత్తుతో బాహుబలిని రికార్డుని తిరగరాసె సినిమా ఇంకేదీ రాదని అందరికీ తెలుసు. ఓవరాల్‌గా బాహుబలిని దాటడం అసాధ్యమైన పనే కానీ, చిన్న చిన్న టార్గెట్లు మాత్రం రీచ్ అయ్యే అవకాశముంది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ‘జనతా గ్యారేజ్’ సినిమా అలాంటి ఒక చిన్నటార్గెట్ ని అందుకుంది. మలయాళ డబ్బింగ్ హక్కుల విషయంలో ‘బాహుబలి’ని ‘జనతా గ్యారేజ్’ సినిమా దాటేసింది. ఎన్టీఆర్ సినిమా మలయాళ హక్కుల్ని అక్కడి డిస్ట్రిబ్యూటర్ రూ.4.5 కోట్లకు కొన్నట్లు సమాచారం. తెలుగు సినిమా చరిత్రలో ఇదే రికార్డు. ‘బాహుబలి’ మలయాళ హక్కులు రూ.3.8 కోట్లకు అమ్ముడైతే, ఆ సినిమా అక్కడ రూ.14 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేయడం విశేషం. నాన్-బాహుబలి రికార్డులన్నీఅల్లు అర్జున్ పేరిటే ఉన్నాయి. అల్లు అర్జున్‌కి మలయాళంలో ఎలాంటి క్రేజ్ ఉందో కొత్తగా చెప్పాల్సినది లేదు. మలయాళంలో ఎన్టీఆర్‌కు ఇప్పుడిప్పుడే మార్కెట్ పెరుగుతోంది. ఐతే ‘జనతా గ్యారేజ్’కు ఈ స్థాయిలో రేటు పలకడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయట. ‘జనతా గ్యారేజ్’ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తుండగా, అక్కడ స్టార్ హీరోగా ఎదుగుతున్న ముకుందన్ విలన్‌గా కనిపించబోతున్నాడు. ఓ కీలక పాత్రలో నిత్యామీనన్ కూడా చేయబోతోంది. అందుకే ‘జనతా గ్యారేజ్’ ఫై మలయాళీలకు అంత మోజు.